రూ.10 ఫేస్ వాల్యూ తో ఉన్న ప్రతి ఈక్విటీ షేరుకు ₹75 ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ ("ఈక్విటీ షేర్లు")
బిడ్ / ఆఫర్ ప్రారంభ తేదీ - శుక్రవారం, ఆగస్టు 18, 2023 మరియు బిడ్ / ఆఫర్ ముగింపు తేదీ - మంగళవారం, ఆగస్టు 22, 2023.
కనీస బిడ్ లాట్ 1600 ఈక్విటీ షేర్లు ఇంక ఆ తరువాత మల్టిపుల్స్ గా ఉండే 1600 ఈక్విటీ షేర్లు.
ఇష్యూ ధర ఈక్విటీ షేరు ఫేస్ వాల్యూకు 7.5 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
హైదరాబాద్, ఆగస్టు 16, 2023 (TGN): టెలికాం, సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీ లో పనిచేస్తున్న పాన్ ఇండియా కస్టమర్లకు ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (“EPC”) సర్వీసులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (“O&M”) సర్వీసులను అందించే బిజినెస్ లో ఉన్న హైదరాబాదుకు చెందిన మౌళిక సదుపాయాల కంపెని బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ తమ తొలి SMC పబ్లిక్ ఆఫర్ ఈక్విటీ షేరుకు రూ.75 చొప్పున నిర్ణీత ధరను నిర్ణయించారు. SME ప్రధాన పబ్లిక్ ఆఫరింగ్ (“IPO” లేదా "ఆఫర్") సబ్స్క్రిప్షన్ ఆగస్టు 18, 2023 శుక్రవారం ప్రారంభమవుతుంది ఇంక ఆగస్టు 22, 2023 మంగళవారం నాడు ముగుస్తుంది. ఇన్వెస్టర్లు కనీసం 1600 ఈక్విటీ షేర్లను, ఆ తరువాత 1600 ఈక్విటీ షేర్ల మల్టిపుల్స్ గా బిడ్ చేయవచ్చు.
రూ.10 ఫేస్ వాల్యూతో ఉన్న పబ్లిక్ ఇష్యూలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) కాంపోనెంట్ లేకుండా రూ.4,272.00 లక్షల విలువగల కొత్త ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు కోర్ డిజైన్, ఇంజనీరింగ్, O&M సర్వీసులను అందించే ప్రముఖ కంపెని బొండాడ ఇంజనీరింగ్. వారి అనుభవం మరియు 550 కంటే ఎక్కువగా ఉన్న వారి నిపుణుల బృందం అందించే సహకారం ఇంకా వారి విజయవంతమైన ట్రాక్ రికార్డుతో ఇది ఖచ్చితముగా స్పష్టమవుతుంది. 2021 లో ఎకనామిక్ టైమ్స్ వారి చేత "టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రొవైడర్" మరియు 2023 లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం వారి చేత "కంపెనీ ఆఫ్ ది ఇయర్" వంటి గొప్ప ప్రశంసలను అందుకున్నారు.
సెల్ సైట్ నిర్మాణం, టెలికాం టవర్ ఆపరేషన్ మరియు నిర్వహణ, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం, విద్యుత్ పరికరాల సరఫరా ఇంకా ఎన్నో టర్న్ కీ సొల్యూషన్స్ తో కలిపి కంపెనీ అనేక టెలికాం రంగంలో విస్తృత శ్రేణి నిష్క్రియాత్మక మౌళిక సదుపాయాల సర్వీసులను అందిస్తోంది. 11,600 టెలికాం టవర్లు, స్తంభాలను ఏర్పాటు చేయడంతో గత మూడు ఆర్థిక సంవత్సరాలలో 7,700 ఇన్స్టలేషన్లను పూర్తి చేసి మంచి పురోగతిని కనబరిచాయి.
2023 ఆర్థిక సంవత్సరంలో బొండాడ ఇంజనీరింగ్ రూ.10.13 కోట్ల నుంచి రూ.18.25 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పెరిగి రూ.334.11 కోట్ల నుంచి రూ.370.59 కోట్లకు పెరిగింది.
వివ్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ అనేది లీడ్ మేనేజర్ ఇంక కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది ఇష్యూకు రిజిస్ట్రార్. BSE లిమిటెడ్ (BSE SME) ల SME ప్లాట్ఫామ్ లో జాబితా చేయబడాలని ప్రతిపాదించబడ్డాయి.Ends
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें